Mon Dec 23 2024 14:28:46 GMT+0000 (Coordinated Universal Time)
మనసు పెట్టి పనిచేస్తే దేశంలోనే నెంబర్ 1 అవుతాం : చంద్రబాబు
అధికారులు మనసు పెట్టి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
అధికారులు మనసు పెట్టి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ విజన్ తో పనిచేయాలన్నారు. తాను హైదరాబాద్లో నాడు ఐటీ సంస్థలను తేబట్టే ఈనాడు దాని ఫలితాలు వస్తున్నాయన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తున్నందు వల్లనే అభివృద్ధి సాధ్యమయిందని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా ప్రణాళికలు రచించాలని చెప్పారు.
అందరం కష్టపడితేనే...
ఈ సదస్సు చరిత్రను తిరగరాయబోతుందన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగానే అధికారులు పనిచేయాలన్నారు. నాటి ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం పెట్టి ప్రజా వేదికను కూల్చిన ఘటనను గుర్తు చేశారు. పనిచేసే అధికారులను పక్కన పెట్టారన్నారు. విధ్వంసం సృష్టించిన గత పాలకులు రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి చేర్చారన్నారు. రాష్ట్రాన్ని పునర్నించాలంటే మామూలు విషయం కాదన్నారు. అందరం కష్టపడితేనే సాధ్యమవుతుందన్నారు. జీఎస్డీపీ పెరిగితేనే సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. అధికారులు పూర్తి సమాచారంతో తమ వద్దకు రావాలన్నారు.
Next Story