Mon Dec 23 2024 08:48:15 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరం కోసం తాను పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని అన్నారు. రాజకీయాల్లో జగన్ ఉండదగని వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి శాపంగా మారారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ ను మార్చారన్నారు. డయాఫ్రం వాల్ ను గత ప్రభుత్వం కాపాడలేకపోయిందన్న చంద్రబాబు జగన్ పోలవరం విషయంలో క్షమించరాని తప్పులు చేశారన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాలుగు సీజన్లు కావాలని, అన్నీ సక్రమంగా పూర్తయితే నాలుగేళ్లకు గాని పోలవరం పూర్తి కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జగన్ నిర్వాకం వల్లనే...
ఈ ఐదేళ్లు ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఏజెన్సీని మార్చడమే ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా కష్టంగా మారిందని, అన్ని చిక్కుముడులు విప్పుకుని ముందుకు సాగాల్సిందేనని అన్నారు. అయినా తన శక్తివంచన లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కృషిచేస్తానని చెప్పారు. జగన్ చేసిన నిర్వాకంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Next Story