Wed Apr 02 2025 11:17:57 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : గుడ్ న్యూస్ ..ఉగాది రోజున సంతకం చేసి చంద్రబాబు వారి జీవితాల్లో?
ఉగాది రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సంతకం చేశారు. ఒక ముఖ్యమైన ఫైల్ ను క్లియర్ చేశారు

ఉగాది రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సంతకం చేశారు. ఒక ముఖ్యమైన ఫైల్ ను క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకానికి సంబంధించిన ఫైలుపై చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఉగాది వేళ ఆ ఫైల్ పై సంతకం చేసి గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు.
38 కోట్ల విడుదల...
దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 38 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్దిదారులకు విడుదల చేయనుంది. ఈ ఫైల్ క్లియర్ చేయడంతో 3456 మంది ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏపీలో 282 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story