Mon Dec 23 2024 15:57:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మంత్రులకు చంద్రబాబు క్లాస్... ఆ టైమ్ ముగిసింది
మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు.
మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. హనీమూన్ సమయం ముగిసిందని, శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించి అభివృద్ధిపై ప్రజలను చైతన్య పర్చాలని చంద్రబాబు మంత్రులను కోరారు. నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు ఒకింత సీరియస్ గానే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మవద్దని, ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
వాస్తవాలను బేరీజు వేసుకున్న తర్వాతే...
అధికారులు చెప్పే సమాచారంతో పాటు, వాస్తవ పరిస్థితిని బేరేజు వేసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న చంద్రబాబు, ఇకపై తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించేలా కృషి చేయాలని గట్టిగా కోరారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఆయన చెప్పడంతో మంత్రులు ఒకింత ఆశ్చర్యపోయారు.
Next Story