Thu Jan 09 2025 03:23:50 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు అనంతపురానికి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాకు రానున్నారు.లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో శనివారం చంద్రబాబు పర్యటించి పింఛన్లను మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఆదివారం కావడంతో....
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తూ వస్తున్నారు. అయితే డిసెంబరు 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30వ తేదీన పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించి లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేందుకు జిల్లా నేతలు ఏర్పాట్లు చేశారు.
Next Story