Wed Dec 25 2024 04:44:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఆ ఎమ్మెల్యేలకు వార్నింగ్ తప్పదా? సీరియస్ హెచ్చరికలు ఉంటాయా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు.
చంద్రబాబు నాయుడు నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. కొందరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు గట్టిగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్లాస్ పీకడానికేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనేక నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ ను విస్మరించడంతో పాటు ఇసుక దందాలోనూ, మద్యం వ్యాపారంలోనూ వారు చేతులు కలిపినట్లు తెలిసిన చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో సీరియస్ అవుతారని తెలిసింది. పద్ధతి మార్చుకోకుంటే తిప్పలు తప్పవన్న హెచ్చరికలు తీవ్రంగానే జారీ చేస్తారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది.
ఇసుక, మద్యం...
ముఖ్యంగా ఉచిత ఇసుక విధానాన్ని కొందరు ఎమ్మెల్యేలు నవ్వుల పాలు చేస్తున్నారన్న విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఉచిత ఇసుక అంటూ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా కొందరు మాఫియాతో చేతులు కలపడటమే కాకుండా, వారి నుంచి పెద్దయెత్తున కమీషన్లు దండుకుంటున్నారని కూడా ఆయన వివిధ మార్గాల నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా ఇందులో భాగస్వామ్యులు కావడంతో చంద్రబాబు నాయుడు ఇక లాభం లేదనుకుని ఎమెర్జెన్సీ మీటింగ్ కు పిలిచారంటున్నారు. వారి ఆగడాలు ఆపకుంటే పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించనున్నారని తెలిసింది.
ఎక్కువ మంది ఎమ్మెల్యేలు....
ఎక్కువగా చిత్తూరు, ఉభయ గోదావరి గుంటూరు, ప్రకాశం కు చెందిన ఎమ్మెల్యేలే ఈ ఆరోఫణలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. తాను చెబుతున్నా వినకుండా మద్యం..ఇసుక టెండర్లలో ఇష్టారాజ్యం వ్యవహరించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నిఘావర్గాల నుంచి ఆధారాలతో సహా సహా సమాచారాన్ని తెప్పించుకున్నారంటున్నారు. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక వ్యాపారాల్లో మితి మీరి జోక్యం చేసుకుంటున్నారు. బినామీలు, అనుచరుల పేర్లతో దందా సాగిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది. కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. దీంతో చంద్రబాబు ఈ సమావేశంలో ఒకింత సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చేటట్లు కనపడుతుంది.
Next Story