Mon Dec 23 2024 12:23:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పింఛను పంపిణీలో ప్రతి నెల ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనాల్సిందే
పెన్షన్ పంపిణీలో ప్రతి నెలా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
పెన్షన్ పంపిణీలో ప్రతి నెలా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలన్నారు. సోషల్ మీడియా, ఐటీడీపీకి ప్రతి సమాచారం ఇవ్వాలని కోరారు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య....
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలన్నారు ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలబడి, వారికి తగిన సాయం చేయాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story