Thu Jan 09 2025 07:09:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఈ కాంబినేషన్ మళ్లీ ఎన్నికలలో మరోసారి సూపర్ హిట్
నిత్యం ప్రజలకు సేవచేస్తూ అందరికీ దగ్గరయిన వ్యక్తి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
అనునిత్యం ప్రజలకు సేవచేస్తూ అందరికీ దగ్గరయిన వ్యక్తి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు శుభదినమని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేటుతో విజయం సాధించామని తెలిపారు. భవిష్యత్ లో ఈ కాంబినేషన్ ఎప్పుడూ ఉంటుందని, మోదీ ప్రధానిగా దేశంలో కొనసాగుతారని చంద్రబాబు అన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిందని, అదే నరేంద్ర మోదీకి చరిష్మా అని అన్నారు. రాసిపెట్టుకోండి.. రేపు ఢిల్లీలో ఎన్నికలలో కూడా ఎన్డీఏదే గెలుపు అని చంద్రబాబు అని అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి...
సంక్షేమం అభివృద్ధి సమపాళ్లతో దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో విశాఖలో రైల్వే జోన్ పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. 2014 నుంచి 2019 లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని, యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా మలచే బాధ్యత తనదేనని ఆయన అన్నారు.
Next Story