Fri Nov 15 2024 11:35:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu: జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకుంది అందుకేనన్న చంద్రబాబు
మాజీ సీఎం జగన్ ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మాజీ సీఎం జగన్ ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమాజంలో ఏ మతానికి అయినా సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయని అన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలను గౌరవించాలని చంద్రబాబు అన్నారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పిన జగన్, డిక్లరేషన్ పై సంతకం ఎందుకు చేేయరని ఆయన ప్రశ్నించారు. బైబిల్ చదివినప్పుడు ఎందుకు హిందూ సంప్రదాయాలు పాటించరని అన్నారు. మతం మానవత్వం అని చెప్పుకునే జగన్ తానే బైబిల్ చదువుతానని ఒప్పుకున్నారని, ఖచ్చితంగా తిరుమలకు వెళ్లినప్పుడు అన్యమతస్థులు సంప్రదాయాలను పాటించాల్సిందేనని అన్నారు. దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేయానికి లేదని చట్టం తెస్తామని చంద్రబాబు అన్నారు.
ఎవరూ అడ్డుకోలేదు...
ఆయనను తిరుమల పర్యటనను ఎవరూ అడ్డుకోలేదన్నారు. తాను హిందూ మతానికి చెందిన వాడినని, తాను వెంకటేశ్వరస్వామిని పూజిస్తానని చంద్రబాబు తెలిపారు. తాను చర్చికి వెళ్లినప్పుడు, మసీదుకు వెళ్లినప్పుడు వారి సంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని జగన్ చెబుతున్నారని, ఎన్డీడీఏ రిపోర్టు ఇచ్చిన రిపోర్టును తప్పుపడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రిపోర్టును బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని చంద్రబాబు నిలదీశారు. కల్తీ నెయ్యి కలపలేదని జరగలేదని జగన్ ఎందుకు అంటున్నారని అన్నారు. కల్తీ నెయ్యి వినియోగించారనే శాంతి యాగం చేశామన్నారు. ఆలయ సంప్రోక్షణ చేశారన్నారు.
బైబిల్ చదువుతానని చెప్పి...
కల్తీపై జగన్ పదే పదే అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. గతంలో రూల్స్ ను ఉల్లంఘిస్తే ఇప్పుడు అతిక్రమించాలని రూల్ ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ప్రసాదం, అన్నదానం, గదులు బాగాలేవని ఎన్నిసార్లు ఎంతమంది ఫిర్యాదు చేశారని చంద్రబాబు అన్నారు. అన్ని దేవాలయాల్లో ఇదే జరిగిందని, అన్ని టెంపుల్స్ లో ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఏఆర్ టెండర్ కు నెయ్యి కేటాయింపులో ఎందుకు టెండర్ నిబంధనలను మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు వైసీపీకి ఉన్నాయా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల వెళ్లాలనుకుంటే వెళ్లాలని, అక్కడ గౌరవాన్ని, సంప్రదాయాలను గౌరవించాలని చంద్రబాబు అన్నారు. సంతకం పెట్టడం ఇష్టంలేకనే జగన్ తనంతట తానే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు.
Next Story