Chandrababu : ప్రాజెక్టు నా చేతుల మీదుగా పూర్తి చేయడం అదృష్టమే. బనకచర్లను కూడా పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత వైసీపీ ప్రభుత్వం క్షమించరాని తప్పులు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత వైసీపీ ప్రభుత్వం క్షమించరాని తప్పులు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కక్ష, అహంభావంతో ఇష్టానుసారంగా వ్యవహరించిందన్న చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో తొందరపడొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రం చెప్పినా వినకుండా వారికి నచ్చినట్లు ప్రవర్తించారన్నారు. రివర్స్ టెండర్ పేరుతో రాజకీయం చేశారని, దీని వల్ల 2,782 కోట్ల కరూపాయలు అదనపు భారం పడిందని తెలిపారు. కాంట్రాక్టర్లను మార్చారని, ఆరు నెలల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదని, ప్రాజెక్టు దుస్థితి చూసి రాష్ట్రంలో బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తానేనని చంద్రబాబు చెప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నా సెంటిమెంట్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం సీఎం పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు.