Mon Dec 23 2024 07:50:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తమ్ముళ్ల ఇళ్లల్లో దీపావళి వెలుగులు.. గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. దీపావళికి ఆయన తీపి కబురు అందించనున్నారు
తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. దీపావళికి ఆయన తీపి కబురు అందించనున్నారు. నామినేటెడ్ పోస్టుల రెండో విడత జాబితాను దీపావళికి ముందే విడుదల చేసే అవకాశముంది. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జాబితాను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఆయన ఈరోజు, రేపట్లో నామినేటెడ్ పోస్టుల రెండో విడత జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ దొరకని నేతలకు, త్యాగం చేసిన తమ్ముళ్లతో పాటు టీడీపీ విజయానికి కృషి చేసిన వారికి కూడా రెండో జాబితాలో చోటు కల్పించినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
నలభై వరకూ...
రెండో విడతలో నామినేటెడ్ పోస్టులను దాదాపు నలభై వరకూ ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరితో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆ రెండు పార్టీలకు సంబంధించి, వారు సిఫార్సు చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నారని చెబుతున్నారు. తొలి దశలో చంద్రబాబు 21 నామినేటెడ్ పోస్టులను మాత్రమే ప్రకటించారు. 21 కార్పొరేషన్ ఛైర్మన్ల పేర్లను ఖరారు చేశారు. వీరంతా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అయితే తొలి జాబితాలో బీజేపీకి ఒక్క కార్పొరేషన్ పదవిని మాత్రమే ఇవ్వగలిగారు. ఈసారి ఎక్కువ పోస్టులు కావాలని కోరుతుంది.
రెండో విడతలో...
మరోవైపు రెండో విడతలో టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మొదటి లిస్ట్ లో మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు జనసేనకు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. అయితే ఈసారి ఎవరికి కేటాయిస్తారు? మరికొందరి అంచనాల ప్రకారం కూటమికి ఎక్కువ స్థానాలను తెచ్చిపెట్టిన ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు ఈసారి భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద పీట వేయనున్నారని తెలిసింది. ఇందుకోసం సీనియ్ నేతల పేర్లను కూడా కొందరిని పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలియవచ్చింది. దీపావళికి ముందే పోస్టులను భర్తీ చేసి తమ్ముళ్ల ఇళ్లల్లో వెలుగులు నింపుదామని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియజెప్పాయి.
Next Story