Mon Dec 15 2025 08:09:27 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఈ వారంలోనే చంద్రబాబు కుప్పం పర్యటన
చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం లాంటి పలు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు.ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు.
తన సొంత నియోజకవర్గంలో...
ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. తనను ఇన్నిసార్లు గెలిపించిన ప్రజలకు సమస్యలు లేనికుప్పంగా తీర్చిదిద్దేందుకు అదే సమయంలో సౌర విద్యుత్తును కూడా ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

