Thu Apr 10 2025 00:31:56 GMT+0000 (Coordinated Universal Time)
జీవీరెడ్డి రాజీనామా ఆమోదం.. ఎండీ బదిలీ
ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు

ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవితో పాటు పార్టీకి జీవీ రెడ్డి హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చర్చ ప్రారంభమయింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆయన రాజీనామాను ఆమోదించింది.
వివాదాన్ని ఈ విధంగా...
అయితే ఫైబర్ నెట్ లో నెలకొన్న వివాదంపై నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ ను బదిలీ చేసింది. అంతేకాదు, దినేష్ కుమార్ ఇకపై జీఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ రెండు చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పకనే చెప్పినట్లయింది.
Next Story