Thu Dec 19 2024 12:24:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆకస్మిక నిర్ణయం.. ప్రవీణ్ ప్రకాష్ బదిలీ
సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీకి బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేశారు. అక్కడ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న భావనా సక్సేనాను విదేశాంగ జాయింట్ సెక్రటరీగా భావనా సక్సేనాను నియమించారు.
ఐఏఎస్ వర్గాల్లో....
ప్రవీణ్ ప్రకాష్ బదిలీ ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రికి ముఖ్య సలహదారుల్లో ఒకరిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ ఐఏఎస్ వర్గాలను కూడా ఆశ్చర్యపర్చింది. ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ పోస్టు అంటే అప్రాధన్య పోస్టు అని ఐఏఎస్ వర్గాలు భావిస్తాయి. మరి ప్రవీణ్ ప్రకాష్ ను జగన్ ఎందుకు వద్దనుకున్నారన్నది తెలియాల్సి ఉంది.
Next Story