Mon Dec 15 2025 06:01:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వాలంటీర్లకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించు కునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ఆ దిశగా...
ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామితోపాటు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో సమావేశం లో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని అధికారుల్ని ఆదేశించారు.
Next Story

