Mon Dec 23 2024 07:56:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇలా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంల విడుదల చేసింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంల విడుదల చేసింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం తుపాను పరిస్థితులపై అధికారులతోనూ, మంత్రులతోనూ సమీక్ష నిర్వహించనున్నారు.
ఆర్థిక శాఖపై...
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న పలు పాలసీలపై సమీక్షను నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తారని అధికారులు తెలిపారు. రానున్న కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ శాఖపై చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story