Sun Jan 12 2025 12:09:26 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త గవర్నర్ ఎదుట జగన్ కోరికల చిట్టా
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురగమిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. న్యాయనిపుణులైన జస్టిస్ నజీర్ అహ్మద్ అనుభవం రాష్ట్రాభివృద్ధికి మరింత ఉపయోగపడాలని జగన్ కోరారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టిం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని జగన్ అన్నారు.
పాత గవర్నర్ కు కూడా...
అలాగే ఛత్తీస్గడ్ గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ కు కూడా జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ గా హరిచందన్ రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఎప్పటికీ రాష్ట్ర ప్రజలు బిశ్వభూషణ్ హరిచందన్ ను గుర్తుంచుకుంటారని,మచ్చలేని వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ఆయన సహకారాన్ని మరువలేమన్న జగన్ అనేక సందర్భాల్లో అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంలో గాని, సంబంధాలు సజావుగా సాగడంలో ఆయన సహకారం మరువలేనిదన్నారు. ఆయన వేరే రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్లడం బాధాకరమైనా, అక్కడి ప్రజలకు మేలు చేకూరుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
Next Story