Mon Dec 23 2024 16:59:44 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులు, అధికారులకు జగన్ అభినందనలు
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. విశాఖపట్నంలో ఈ నెల 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
ఎంవోయూలు అమలు దిశగా...
ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు జగన్ సూచించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story