Sat Nov 30 2024 04:38:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎమ్మెల్సీ స్థానాలపై జగన్ గురి
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు. అభ్యర్థులను ముందుగానే ఖరారు చేశారు
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు. అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను తప్పించి గ్రాడ్యుయేట్ అభ్యర్థులను ఖరారు చేశారు. ముందుగానే ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించారు. ప్రజల్లోకి అభ్యర్థులు వెళ్లి ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవాలని సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జగన్ కోరారు. ఓటర్ల నమోదు పై కూడా గట్టిగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ వారికి సూచించారు.
అభ్యర్థులు వీరే....
ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎస్. సుధాకర్ పేరును ఖరారు చేశారు. సుధాకర్ ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యరథిగా శ్యాంప్రసాద్ రెడ్డ ిపేరును ఖరారు చేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి గూడూరు జిల్లాకు చెందిన వారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి వెన్నపూస రవి పేరును ఖరారు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. వీరంతా ఓటర్ల జాబితాను చూసుకోవడం, చేర్పులు, మార్పులు చేయడం, ప్రచారం చేయడం ప్రారంభించాలని జగన్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు సూచించారు
Next Story