Mon Dec 23 2024 10:57:33 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు
విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 125 అడుగులతో రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.
భారీ బహిరంగ సభకు...
అయితే ఈ విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనాన్ని ప్రారంభించేందుకు జనవరి 19వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రభుత్వం దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశముండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story