Sun Dec 22 2024 11:58:43 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రైలు ప్రమాదంపై ట్విట్టర్ లో జగన్
విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమయిందని ఆయన ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమయిందని ఆయన ప్రశ్నించారు. బ్రేకింగ్ సిస్టమ్, అలర్టింగ్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు. ప్రమాద సమయంలో సమాచార వ్యవస్థ విఫలమవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాద ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని జగన్ ప్రధాని, రైల్వే శాఖ మంత్రిని ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో కోరారు.
సిగ్నలింగ్ వ్యవస్థ...
కాగా ముఖ్యమంత్రి జగన్ విజయనగరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలతో కూడా జగన్ భేటీ అయ్యారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని అన్న జగన్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే శాఖ అన్ని చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర రైల్వే శాఖను కోరారు.
Next Story