Mon Dec 23 2024 04:53:47 GMT+0000 (Coordinated Universal Time)
బాబులో భయం కనిపిస్తుంది : జగన్
చంద్రబాబులో ఇవే తన చివరి ఎన్నికలు అన్న భయం కనిపిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
చంద్రబాబులో ఇవే తన చివరి ఎన్నికలు అన్న భయం కనిపిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అధికార భగ్నప్రేమికుడు చంద్రబాబు ఇవే తన చివరి ఎన్నికలని రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను గెలిస్తే ఏం చేయాలో చెప్పకుండా, తనను గెలిపించకపోతే చివరి ఎన్నికలని బ్లాక్ మెయిల్ మాత్రం చేస్తున్నాడని జగన్ అన్నారు. దత్తపుత్రుడు తన పార్టీని రౌడీసేనగా మార్చేశారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లోనే వీరికి ప్రజలు బైబే చెప్పేశారని, మరొక సారి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జగన్ అన్నారు. ఇదేం ఖర్మరా బాబూ అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగు బూతుల పార్టీ...
టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని జగన్ అన్నారు. చంద్రబాబు, దత్తపత్రుడు కలసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. చివరకు కుప్పంలోనూ గెలవలేనన్న నిరాశలో చంద్రబాబు ఉన్నారన్నారు. 45 ఏళ్లలో ఎప్పుడు చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పధకం అందిందని తెలిపారు. మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే తమకు మద్దతు ఇవ్వమని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచి జరిగిందా లేదా? అన్నదే కొలమానంగా తీసుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రతి మాటలో భయం కనపడుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story