Sun Dec 22 2024 13:12:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రాబాబు భార్యే కుప్పం వెళ్లి బాబుకు బై బై అంటున్నారు
వందమంది సినిమా విలన్ల కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమెక్కువ అని జగన్ అన్నారు.
వందమంది సినిమా విలన్ల కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమెక్కువ అని జగన్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే 1119 కేసులు టీడీపీ నేతలు కేసులు వేశారన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు నిస్సిగ్గుగా మ్యానిఫేస్టోను విడుదల చేస్తున్నారంటున్నారు. మనం ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడని జగన్ అన్నారు. కుప్పంలోనూ చంద్రబాబును సమర్థించడం లేదని తెలిపారు. ఏనాడూ ఏపీలో లేనివారు, ఏపీకి రాని వారు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని, ప్రజలను నమ్ముకున్నానని, దళారులను నమ్ముకోలేదని అన్నారు. అబద్ధాలను నమ్మవద్దని, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారని జగన్ అన్నారు.
మంచి జరిగితేనే...
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో అనేక మార్పులు తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు.. వారికి ఇంటిని నిర్మించి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని, ఇది ఎన్నడూ జరగలేదన్నారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు ఇచ్చి మరీ పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. ఒంగోలులో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు సర్వహక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇంటింటి తలుపు తట్టి ప్రజలకు ఈ ప్రభుత్వం సేవలను అందిస్తున్నామని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఇంగ్లీష్ మీడియంను తీసుకు వచ్చామని తెలిపారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ప్రభుత్వానికి మరోసారి అండగా నిలవాలని ఆయన కోరారు.
పేదల కోసం...
గత యాభై ఎనిమిది నెలల కాలంలో పేదల కోసం అనేక పథకాలను ఈ ప్రభుత్వం తెచ్చిందన్నారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులు చదువుకునే వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచామని జగన్ తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి చదువుక, ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని ఆలోచించి అన్ని నిర్ణయాలు ఆవైపుగానే తీసుకున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసమే ప్రతి అడుగు వేశామని, ఇది కొందరికి నచ్చడం లేదని జగన్ అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా డిజిటల్ క్లాస్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.
అందరికీ ఒకే న్యాయం...
ఆరోగ్య శ్రీ ప్రొసీజర్స్‌ను 3,300 లకు పెంచామని తెలిపారు. పేదల ఇళ్ల వద్దకే వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసి వారికి చికత్స చేసేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. పేదలకు, పెద్దలకు ఒకే న్యాయం ఉండాలని చెప్పి తమ ప్రభుత్వం ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. నామినేటెడ్ పదవులలో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చామని చెప్పారు. ఆసుపత్రిలో వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని అన్ని రకాలుగా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని జగన్ చెప్పుుకొచ్చారు.
Next Story