Mon Dec 23 2024 15:40:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు..
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.. ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారు చేసినవే పెట్టాలని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖలో జరిగిన పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో కుదిరిన ఎంవోయూలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులని అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖ బీచ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్లీనింగ్ జరిగిందని సీఎం జగన్ అన్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలీ వరకూ 76 టన్నుల ప్లాస్టిక్ ను సముద్రతీరం నుంచి తొలగించారని చెప్పారు.
సముద్రాన్ని కాపాడుకుంటేనే...
సముద్రాన్ని కాపాడుకుంటేనే మన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు తీసి రీసైకిల్ చేసి ఉత్పత్తులు తయారు చేస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా జగన్ అభివర్ణించారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా మారుస్తానని జగన్ ప్రకటించారు. ఆయన ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన షూ, కళ్లజోడులను ఆయన చూపించారు. అందుకే పార్లే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
Next Story