Mon Dec 23 2024 02:24:28 GMT+0000 (Coordinated Universal Time)
టీచర్లను కూడా రెచ్చగొడితే ఎలా?
ఉపాధ్యాయులను కూడా రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
ఉపాధ్యాయులను కూడా రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఉపాధ్యాయ దినోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఎల్లో మీడియా కూడా టీచర్లను రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు. పేదలకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలను ఏపీలో తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని జగన్ తెలిపారు. చదువులు నేర్పుతున్న గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మెరుగైన జీవితాన్ని గడపడం ఎలాగో నేర్పిన గురువుకు రుణపడి ఉంటానని జగన్ అన్నారు.
మంచి చదవులు అందించాలనే....
పేదలకు మంచి చదవులు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. అందుకే పౌష్టికాహారం మెనూలో మార్పులు చేశామని చెప్పారు. ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకంటే ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు ఉత్తమ ఉపాధ్యాయులను జగన్ సత్కరించారు. తాను విద్యాశాఖ మీద చేసిన రివ్యూలు ఏ శాఖ మీద చేయలేదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. అన్ని విధాలుగా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పారు.
Next Story