Tue Mar 11 2025 06:07:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎంత కష్టమొచ్చినా ఆదుకుంటాం
ఎంత కష్టమొచ్చినా ప్రజల సమస్యలను పట్టించుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

ఎంత కష్టమొచ్చినా ప్రజల సమస్యలను పట్టించుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కొత్తగా ఎంపికయిన లబ్దిదారుల ఖాతాల్లో జగన్ పథకాల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా పథకాలను అందచేస్తున్నట్లు జగన్ వివరించారు. ఏ ఒక్కరూ రాష్ట్రంలో ఇబ్బందిపడకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు.
కొత్తగా పింఛన్లు...
ఈరోజు కొత్తగా పథకాలు అందని 3,39,096 మంది లబ్దిదారులకు నగదును అందజేసినట్లు జగన్ వివరించారు. ప్రభుత్వం ఇందుకోసం 137 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందన్నారు. కొత్తగా 2.99 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసిందని చెప్పారు. కొత్తగా అర్హులైన వారిని గుర్తించి 3,035 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశామని జగన్ తెలిపారు. అర్హత ఉన్న వారు నష్టపోకూడదన్నదే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని జగన్ వివరించారు.
Next Story