Mon Dec 23 2024 08:18:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేటి వాలంటీర్లే రాబోయే రోజుల్లో లీడర్లు
వాలంటీర్లు వచ్చే కాలంలో లీడర్లు కాబోతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
వాలంటీర్లు వచ్చే కాలంలో లీడర్లు కాబోతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఒక్క రూపాయి లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన మాట్లాడారు. 2.60 లక్షల మంది వాలంటీర్లు తన సైన్యంగా ఆయన అభివర్ణించారు. 58 నెలలు అలసి పోకుండా ప్రజలకు సేవ చేశామని చెప్పారు. లంచం లేని వ్యవస్థను అందించడమే వాలంటీర్ల ినియామకం అని జగన్ తెలిపారు. టీడీపీని అధికారంలో నుంచి దించడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలని, 2024లో తిరిగి వైసీీపీ అధికారంలోకి రావడానికి కారణం వాలంటీర్ల వ్యవస్థ అని ఆయన అన్నారు.
వాళ్లే నా సైన్యం...
వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపు రేఖలనే మార్చాయిని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నామంటే అది వాలంటీర్ల వ్యవస్థ గొప్పతనమని అని అన్నారు. లబ్దిదారుల ఎంపికలో కూడా వాలంటీర్ల వ్యవస్థ అమోఘమని, ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఎంపికచేసి అందరి మన్ననలను అందుకున్నారని ఆయన తెలిపారు. మరో రెండు నెలల్లో యుద్ధానికి సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కూడా జగన్ అన్నారు. చంద్రబాబు పెట్టినన దుర్మార్గమైన జన్మభూమి కమిటీల వల్ల అన్నింటా లంచం రాజ్యమేలిందన్నారు. వివక్షను కూడా ప్రదర్శించారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో...
ఆర్బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా నిలబడుతుందని జగన్ అన్నారు. ప్రతి నెల ఒకటోతేదీన ఉదయాన్ని పింఛను అందించడంలో వాలంటీర్లు చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో విలేజీ క్లినిక్ లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. గత పాలనకు, మన పాలనకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలని జగన్ కోరారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఇంటికి కావాల్సిన సర్టిపికెట్లు అన్ని ఇంటికే వస్తున్నాయని తెలిపారు. గత పాలనలో స్కీమ్లు లేవు, బటన్ లు లేవు.. మంచిచేయాలన్న తపన చంద్రబాబుకు లేదని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని కోరారు. మంచి పౌర సేవలను అందించాలంటే వాలంటీర్ల వ్యవస్థ అవసరమని ఆయన అన్నారు. గౌరవ వేతనంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చిన వాలంటీర్లకు తన సెల్యూట్ అని అన్నారు.
Next Story