Fri Dec 20 2024 01:53:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రబాబు మూడుసార్లు గెలిచింది ఇలాగే.. స్కీమ్ ల వల్ల కాదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడీయేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నూజవీడులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడీయేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసైన్డ్ భూముల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. నూజివీడులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూములపై హక్కులను కల్పిస్తూ అందరికీ పట్టాలను అందచేశారు. ఏరోజూ చంద్రబాబు ముఖ్యమంత్రి స్కీమ్ ల వల్లనో, మంచిపనులో కాలేదన్నారు. తొలిసారి ఆయన పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, రెండోసారి కార్గిల్ పుణ్యాన, మూడోసారి ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మాయ మాటలు చెప్పి మూడో సారి అధికారంలోకి వచ్చాడన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు గూబ గుయ్యమనిపించేలా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. 175 స్థానాలకు 151 స్థానలను వైసీపీకి ఇచ్చారన్నారు.
భూముల సర్వేకు...
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా? అని అంటారా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో భూముల రీసర్వే చేయించి 4,33,000 కమతాలను నిర్ధారిస్తూ, వాటి సరిహద్దులను నిర్ణయించామని చెప్పారు. నాలుగు వేల గ్రామాల్లో సర్వే పూర్తయిందని చెప్పారు. వందేళ్ల తర్వాత జరిగిన ఈ సర్వేతో రైతులకు మంచి జరుగుతుందన్నారు. పదిహేను వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు సర్వేలు చేస్తున్నారన్నారు. అసైన్ట్ భూములున్న వారికి సర్వహక్కులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 27,47 లక్షల ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూహక్కులు కల్పించామని, దీని ద్వారా పదిహేను లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు.
పేదల ప్రభుత్వమిది...
పేదల ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ఎప్పటికీ మిగిలిపోతుందని జగన్ అన్నారు. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని తెలిపారు. 42 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. భూతగాదాలకు పరిష్కారం చూపామని తెలిపారు. గిరిజనులకు పోడు భూములపై కూడా హక్కులను కల్పించామని తెలిపారు. కొత్తగా డీకేటీ పట్టాలను ఇస్తున్నామని తెలిపారు. మూడో దశ సర్వే కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని జగన్ తెలిపారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించామని జగన్ తెలిపారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ కూడా భూ సర్వే చేయలేదన్నారు.
పేదల కష్టాలు తెలిసే...
దీంతో పాటు పేదల కష్టాలు తెలిసి అందరికీ ఇళ్లు ఉండాలని, 36 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల గుండె చప్పుడుగా ఈ ప్రభుత్వం మారిందన్నారు. సామాజిక న్యాయం నినాదంగా కాకుండా ఒక విధానంగా మారిందన్నారు. ఉద్యోగాలను లక్షల స్థాయిలో భర్తీ చేయడం చరిత్రలో ఇదే ప్రధమమని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారన్నారు. అన్ని విషయాల్లోనూ వారికి ఎనభై శాతం రిజర్వేషన్ ను కల్పిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో దోచుకుని పంచుకుని తినడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రైతులకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అందరం చూశామన్నారు. ఎవరిపట్ల చంద్రబాబుకు గౌరవం, ప్రేమలేదన్నారు.
News Summary - chief minister ys jagan said that when chandrababu was the chief minister, everything was robbery
Next Story