Mon Dec 23 2024 12:14:55 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ చొరవతో "సక్సెస్"
ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలను నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపించారు
ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలను నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపించారు. హెలికాప్టర్ ద్వారా గుంటూరు నుంచి తిరుపతికి గుండెను వైద్య బృందం తరలించడంలో ముఖ్యమంత్రి జగన్ కీలక భూమిక పోషించారు. సీఎం జగన్ ఆదేశాలతో వెంటనే హెలికాప్టర్ ను ఏర్పాటు చేసి గుంటూరు నుంచి తిరుపతికి సరైన సమయంలో గుండెను చేర్చగలిగారు. తిరుపతితోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కు గుండెను తరలించడంలో వైద్య బృందం సక్సెస్ అయింది.
అవయవదానం...
తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి గుండె మార్పిడి చేయాల్సి వుంది. అయితే బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి కట్టా కృష్ణా నుంచి గుండెను సేకరించి గుంటూరు నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో తరలించాలంటే సమయం వృధా అవుతుందని భావించిన వైద్యులు సీఎంవో సాయాన్ని కోరారు. వెంటనే సానుకూలంగా స్పందించిన జగన్ గుండెను తరలించడానికి హెలికాప్టర్ ను ఉపయోగించి ఆపరేషన్ విజయవంతంగా ముగించారు. బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు రావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. దీంతో తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి సకాలంలో గుండెమార్పిడికి జగన్ సహకరించారు.
Next Story