Mon Jan 13 2025 06:02:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నేడు ఢిల్లీకి జగన్.. చంద్రబాబు ఇటు రాగానే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారని పా్టీ వర్గాలు తెలిపాయి. మోదీ అపాయింట్మెంట్ కూడా ఖరారయినట్లు తెలిసింది. పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది.
చంద్రబాబు వచ్చి వెళ్లగానే...
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షా తో భేటీ అయి వచ్చిన మరుసటిరోజే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం నిధుల అంశమే కాకుండా రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. మరి రెండు ప్రాంతీయ పార్టీల అగ్రనేతల ఢిల్లీ పర్యటనలు ఏపీ రాజకీయాలను వేడి పుట్టిస్తున్నాయి.
Next Story