Fri Dec 20 2024 17:58:59 GMT+0000 (Coordinated Universal Time)
20న జగన్ పోర్టు కు భూమిపూజ
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మణిహారం కాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
వెన్నుపోటు చంద్రంలా...
అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. "వెన్నుపోటు" చంద్రంలా మభ్య పెట్టే ప్రకటనలు, చిత్తశుద్ధిలేని శంకుస్థాపనలు ఈ ప్రభుత్వంలో ఉండవని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
Next Story