Mon Dec 23 2024 15:13:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నరసారావుపేటకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నరసరావుపేటలో పర్యటించనున్నారు. వాలంటీర్లకు జరిగే సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నరసరావుపేటలో పర్యటించనున్నారు. వాలంటీర్లకు జరిగే సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట కోడెల స్టేడియంలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, జగన్ ఢిల్లీ పర్యటన కారణంగా ఈరోజుకు వాయిదా పడింది.
అవార్డులతో సత్కారం.....
నరసారావుపేటలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు నేటి నుంచి సత్కార కార్యక్రమం జరగనుంది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. రాష్ట్రంలోని 2.33 లక్షల మంది వాలంటీర్లను సన్మానించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 258 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సేవా వజ్ర కింద 30 వేలు, సేవారత్న కింద 20 వేలు, సేవామిత్ర కింద పదివేలు నగదును వాలంటీర్లకు అందజేయనున్నారు.
Next Story