Sat Dec 21 2024 01:53:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నెల్లూరు జిల్లాకు జగన్
ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణపనులకు నేడు భూమిపూజ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణపనులకు నేడు భూమిపూజ చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. రామాయపట్నం పోర్టుకు తొలి దశ టెండర్లు ఖరారు అయ్యాయి. ఈ ప్రాజెక్టు కారణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులకు ఈ పోర్టు వరంగా మారనుంది. తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వాణిజ్య రవాణా సులభతరమవుతుందని చెబుతున్నారు.
పర్యటన ఇలా...
జగన్ ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు. అక్కడ పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story