Tue Apr 15 2025 18:05:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మంగళగిరిలో లాస్ట్ పంచ్ వేసేందుకు జగన్
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయింది

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయింది. నేడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆయన ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మూడు నియోజకవర్గాల్లో...
శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మంగళగిరిలో తొలుత ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 12.30 గంటలకు చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజకవర్గంలో జరిగే సభలో జగన్ ప్రసంగించనున్నారు. సాయత్రం మూడు గంటలకు కడప జిల్లాలోని కడపలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఎల్లుండితో ప్రచారం ముగియనుండటంతో ఈరోజు మూడు సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story