Sat Apr 12 2025 18:39:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభించనున్న జగన్
నేడుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు లయోలా కళాశాలలో జరగనున్న క్రీడా వేడుకలను ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరపనుంది.
లక్షల మంది క్రీడాకారులు...
నేటి నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఐదు దశల్లో నిర్వహించనున్న ఈ పోటీల్లో 34.19 లక్షల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇప్పటికే 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయనున్నారు. క్రికెట్ నుంచి యోగ, మారథాన్, టెన్నీకాయిట్, కబడ్డీ వంటి క్రీడలు ఇందులో ఉన్నాయి.
Next Story