Mon Dec 23 2024 13:49:14 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి బొత్సకు పాదాభివందనం... జేసీ సరెండర్
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ను సరెండర్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ను సరెండర్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. కలెక్టర్ తో సంబంధం లేకుండా భూములకు సంబంధించి కొన్ని ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పై కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనను సరెండర్ చేయాలని కలెక్టర్ సూర్యకుమారికి ఆదేశాలు అందాయి.
అప్పుట్లో వివాదమే...
జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గతంలోనూ వివాదంలో చిక్కుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పాదాభివందనం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. బొత్సకు పాదాభివందనం చేసిన జేసీ కిషోర్ కుమార్ ను సరెండర్ చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అయితే బొత్సకు పాదాభివందనం చేసినందుకు కాదని, భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలే ఈ సరెండర్ కు కారణమని చెబుతున్నారు.
Next Story