Thu Dec 19 2024 06:41:05 GMT+0000 (Coordinated Universal Time)
పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు.. రాత్రికి కొలిక్కి వచ్చే అవకాశం
ఈ నెల పింఛను పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. ప్రతి నెల ఒకటోతేదీన ఇంటికి ఇచ్చి తెచ్చే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బ్రేకులు పడ్డాయి. వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఈ నెల పింఛను పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటింటికీ పింఛను పంపిణ ీ చేయవచ్చని కొందరు కలెక్టర్లు సూచించారు.
వారంలోపు అందరికీ...
వారంలోపు అందరికీ పింఛన్లను పంపిణీ చేయవచ్చని వారు తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేయడానికి ఎటువంటి ిఇబ్బందులు ఎదురుకావని, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం కష్టమేనని వారు తెలిపారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేయాల్సి వస్తే అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లు జవహర్ రెడ్డికి సూచించారు. ఈ రాత్రికి పింఛను పంపిణీపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఈరోజు రాత్రికి విడుదల చేేసే అవకాశముంది.
Next Story