Mon Dec 23 2024 19:41:25 GMT+0000 (Coordinated Universal Time)
సమ్మెకు వెళ్లడం సరికాదు... సమీర్ శర్మ పరోక్ష వార్నింగ్
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరికాదని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉద్యోగులకు సూచించారు
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరికాదని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉద్యోగులకు సూచించారు. ప్రతి ఉద్యోగి దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రతి ఉద్యోగి ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. కోవిడ్ అనంతరం కూడా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యే కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగ, వ్యాపార వర్గాలు కోలుకుంటున్నాయని, వారిని సమ్మెతో మరింత దెబ్బతీయవద్దని ఆయన సూచించారు.
చర్చల ద్వారానే.....
సమస్యలుంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సమీర్ శర్మ సూచించారు. జిల్లా కలెక్టర్లు ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని కోరారు. ఉద్యోగులంతా ఒక కుటుంబమని గుర్తించాలని, సమస్యలను పరిష్కరించుకునేందుకు వేరే మార్గాలున్నాయని సమీర్ శర్మ గుర్తు చేశారు. ఆయన జిల్లా కలెక్టర్లు, ఆర్థిక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Next Story