Sun Nov 17 2024 12:29:54 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో చిన్నారిని చంపేసిన చిరుత
తిరుమలలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని చిరుత చంపేసిందని
తిరుమలలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని చిరుత చంపేసిందని అధికారులు, పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అలిపిరి నడకమార్గంలో గత రాత్రి బాలిక తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడంలో తిరుమలలో విషాదాన్ని నిపిందింది.
నడక మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లవెద్దని టీటీడీ హెచ్చరించింది. భక్తులు గుంపులుగా మాత్రమే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవాలని సూచించింది. నెల రోజుల క్రితమే ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. అదే ప్రాంతంలో ఇప్పుడు బాలికపై దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నడక మార్గంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. కానీ, చిరుత దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.
Next Story