Fri Apr 11 2025 16:17:14 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ గా అయ్యన్న ఎన్నిక లాంఛనమే
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, , మంత్రులు నారా లోకేష్ , పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు , సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
రేపు సభలో ప్రకటించనున్న...
స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కూటమి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో ఇక ఎవరూ మూడు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. వైసీపీకి పోటీ చేసేంత బలం లేదు. రేపు శాసనసభలో అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికయినట్లు ప్రకటించనున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎంపిక లాంఛనమే.
Next Story