Mon Dec 23 2024 00:33:27 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైసీపీ ఈసారి టిక్కెట్ కేటాయించలేదు.
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైసీపీ ఈసారి టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనను వైఎస్ షర్మిల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గత ఎన్నికల్లో....
ఎలీజా 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ సర్వేల ద్వారా వైసీపీ అధినేత జగన్ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో ఎలీజా కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా చింతలపూడి నుంచి పోటీ చేసే అవకాశముంది.
Next Story