చిరంజీవి సారీ చెప్పారు
తన ఇంట్లో ఆడవాళ్లను తిట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదని పోసాని విమర్శించారు. చంద్రబాబు ఏం చెప్తే దానికి వెంటనే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మరోసారి నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ చేసిన పనులకు.. చిరంజీవి క్షమాపణలు చెప్పారని అన్నారు. పవన్ చేసిన ఎన్నో పొరపాట్లకు ఆయన తరఫున అన్నయ్య చిరంజీవి చాలామందికి ఫోన్లు చేసి క్షమాపణలు చెప్పారని.. పేర్ని నాని లాంటి నాయకులకు ఫోన్లు చేసి తెలియక తప్పుగా మాట్లాడాడులే క్షమించండి అని చిరంజీవి అన్నారని వెల్లడించారు. అసలు సిసలైన మనిషి అంటే చిరంజీవి అని కొనియాడారు. నీ మీద నాకు కోపంతో కాదు.. ఎన్ని పొరపాట్లు మళ్లీ మళ్లీ చేస్తావని ప్రశ్నించారు. నువ్వు చేసిన చాలా పొరపాట్ల కారణంగా చిరంజీవి ఈ రోజు నీ తరపున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. సీఎం జగన్‌కి కాల్ చేసి సారీ చెప్పాడు. మావాడు తెలియక మాట్లాడాడు క్షమించండి అని అడిగారన్నారు పోసాని. అప్పట్లో చిరంజీవిని రామోజీరావు పిలిచి.. వైఎస్సార్‌ను ఓడించాలంటే చంద్రబాబు వల్ల కాదు, నువ్వు కలువు, కొన్ని సీట్లు తీసుకో అని అన్నారు. తొలిసారి పార్టీ పెట్టుకున్నాను, అలా నేనెందుకు చేస్తాను, ఓడిపోయినా ఫర్వాలేదు కానీ బాబుతో నేను కలవనని చెప్పారు. చిరంజీవి వాళ్లకు నచ్చక చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను ఘోరంగా తిట్టించారు. ఆయన కన్నీళ్లు పెట్టాడు.. మీకు తెలుసు. బాధపడ్డాడు.. మీకు తెలుసు. ఏంటి మురళీ ఈ దరిద్రం.. వాళ్ల మాట వినకపోతే, రాజకీయాల్లోకి వస్తే ఇంట్లో ఆడవాళ్లనే టార్గెట్ చేస్తారా! నన్ను చేయమను టార్గెట్ భరిస్తా.. ఆడవాళ్లు ఎలా భరిస్తారయ్యా?’ అని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగిన సంఘటన గురించి పోసాని వివరించారు.