Tue Nov 12 2024 20:10:42 GMT+0000 (Coordinated Universal Time)
రూ.2 వేల మార్పిడి.. చంపేస్తామని సీఐ స్వర్ణలత బెదిరింపులు, అరెస్ట్
వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో రూ. 90 లక్షల రూ.500 నోట్లు ఇస్తే కోటిరూపాయల విలువైన రూ.2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్
రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసి నెలరోజులైంది. అయితే రూ.2 వేల నోట్లను మార్చి.. తగిన సొమ్మును బ్యాంకుల్లో తీసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు ఇచ్చింది. ఒకరు రోజుకి రూ. 10 నోట్లను మాత్రమే మార్చుకోవాలన్న నిబంధన ఉంది. డిపాజిట్ కి లిమిట్ లేదు కాదు.. అందుకు కావాలసిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు పెద్దమొత్తంలో రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ఇప్పుడీ రూ.2 వేల నోట్ల మార్పు వ్యవహరమే ఓ సీఐ మెడకు చుట్టుకుంది. ఫలితంగా ఆమెను అరెస్ట్ చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో రూ. 90 లక్షల రూ.500 నోట్లు ఇస్తే కోటిరూపాయల విలువైన రూ.2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ఆ ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. విశాఖ కమిషనరేట్ పరిధిలోని బీచ్ రోడ్డులో రెండురోజుల క్రితం తనిఖీ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తుల వద్ద భారీగా నగదు పట్టుబడింది. కమీషన్ ప్రాతిపదికన నగదు మారుస్తున్నట్లు వారు చెప్పగా.. అందుకు సరైన ఆధారాలు లేవంటూ.. మహిళా సీఐ స్వర్ణలత రూ.20 లక్షలు నొక్కేశారు. ఆ తర్వాత తన సిబ్బందిచేత వారిని కొట్టించి, బెదిరించి పంపేశారు.
బెదిరింపులకు గురైన రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. ఘటనపై సమగ్ర విచారణ జరపా లని డీసీపీ -1 విద్యాసాగర్ నాయుడు, క్రైమ్ డీసీపీ జి.నాగన్నలను ఆదేశించారు. విచారణలో ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో గురువారం సీపీకి నివేదించారు. ఆ నివేదిక ప్రకారం.. మహిళా ఏఆర్ సీఐ స్వర్ణలతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. సీఐతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ 386 ఎక్స్ టార్షన్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసు లేకుండా చేయాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుంచి పోలీసులకు ఒత్తిడి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Next Story