Mon Dec 23 2024 12:25:26 GMT+0000 (Coordinated Universal Time)
Fibernet scam : చంద్రబాబుపై మరో పిటీషన్
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ ను ఏసీీబీ కోర్టు విచారణకు స్వీకరించింది
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటీషన్ వేసింది. పీటీ వారెంట్ వేసింది. ఈ పిటీషన్ ను ఏసీీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో సీఐడీ తరుపున న్యాయవాదులు ఈ పిటీషన్ వేశారు. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ వేసిన పిటీషన్ ను ఏసీబీ కోర్టు న్యాయస్థానం స్వీకరించడంతో దీనిపైన కూడా విచారణ జరగనుంది. ఈ స్కాంలో 121 కోట్లు పక్కదారి పట్టాయని పిటీషన్ లో సీఐడీ పేర్కొంది. గతంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం దర్యాప్తు చేసిందని పేర్కొంది. 2021లోనే కేసులో 19 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్ కట్టబెట్టారని ఈ పిటీషన్ లో తెలిపారు.
విచారణకు స్వీకరణ...
ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో మరో అవినీతి కేసుపై సీఐడీ పిటీషన్ వేయడంతో ఆయనపై వరసగా కేసులు వేసేందుకు సీఐడీ సిద్ధమయిందని చెప్పాలి. ఫైబర్ నెట్ లో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందని సీఐడీ విచారణలో బయటపడిందని అధికారులు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఈ కేసును కూడా ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది. ఈ కేసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉందని కూడా గతంలో సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.
Next Story