Sun Dec 22 2024 23:03:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఐడీ కస్టడీకి మరో పిటీషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును విచారించేందుకు తమకు అనుమతివ్వాలని సీఐడీ తరుపున న్యాయవాదులు మరో పిటీషన్ లో కోరారు.
మెమో దాఖలు చేయాలని...
ఇప్పటికే ఇచ్చిన రెండు రోజుల కస్టడీ ముగిసింది. విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని, అందుకోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపున న్యాయవాదులు కోరారు. కస్టడీ పొడిగింపుకు మెమో దాఖలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. అయితే మెమో దాఖలుకు కొంత సమయం ఇవ్వాలని సీఐడీ కోరింది.
Next Story