Mon Dec 23 2024 07:40:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నారా లోకేష్ ను అరెస్ట్ చేయడానికి సీఐడీ అధికారులు
నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు
నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం లోకేష్ కు ముందుగా నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
రెడ్ బుక్ పేరుతో...
నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే 41 ఎ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయని సీఐడీ అధికారులు పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఆయనకు పర్సనల్ గా నోటీసులు ఇవ్వాలని చెబుతూ విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
Next Story