Mon Dec 23 2024 01:24:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : లోకేష్ కోసం... ఢిల్లీకి సీఐడీ అధికారులు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇవ్వనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో నారా లోకేష్ ను ఎ 14గా చేర్చిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటీషన్ ను దరఖాస్తు చేసుకున్నా హైకోర్టు మాత్రం 41ఎ నోటీసులు జారీ చేసి విచారించవచ్చని తెలిపింది.
ఎ 14 నిందితుడిగా...
ఈ కేసులో సీఐడీ అధికారులకు నారా లోకేష్ కూడా విచారణకు సహకరించాలని న్యాయస్థానం తెలిపింది. దీంతో నారా లోకేష్ కోసం సీఐడీ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో న్యాయనిపుణులతో సంప్రదించేందుకు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. యువగళం పాదయాత్రను కూడా ఆయన వాయిదా వేసుకుని మరీ న్యాయనిపుణలతో చర్చిస్తున్నారు. జాతీయ నాయకులను కలసి మద్దతు కోరుతున్నారు.
Next Story