Thu Dec 19 2024 15:14:30 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నారా లోకేష్ కు నోటీసులు.. ఢిల్లీ వెళ్లి మరీ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు. ఢిల్లీలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు.
అక్టోబరు 4వ తేదీ...
అక్టోబరు 4వ తేదీ ఉదయం పది గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఎ 14 నిందితుడిగా చేర్చిన సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు కేసుల నిమిత్తం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారని తెలుసుకున్న అధికారులు అక్కడకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మరి నోటీసులు తీసుకున్న నారా లోకేష్ అక్టోబరు 4వ తేదీన విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story