Mon Dec 23 2024 15:45:29 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్మీనారాయణ కు నోటీసులు.. 13న హాజరు కావాల్సిందే
చంద్రబాబు సన్నిహితుడు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
చంద్రబాబు సన్నిహితుడు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా లక్ష్మీనారాయణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిన కేసులో లక్ష్మీనారాయణ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులుగా చేర్చింది.
సీఐడీ పోలీసుల సోదాలు...
ఈరోజు సీఐడీ పోలీసులు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు లో బీపీ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు షాబాద్ లోని గంటా సుబ్బారావు ఫాం హౌస్ లోనూ ఏపీ సీఐడీ సోదాలు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇంటి నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
Next Story