Mon Dec 23 2024 15:48:55 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సీఐడీ కీలక నిర్ణయం.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు
ఫైబర్ నెట్ కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆస్తుల అటాచ్ కు ప్రతిపాదన సిద్ధం చేసింది
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదనను సిద్ధం చేసింది. అటాచ్మెంట్ అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కోర్టు అనుమతిస్తే ఆస్తులను అటాచ్మెంట్ చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
కోర్టు అనుమతి కోసం...
సీఐడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఇప్పటికే హోంశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక న్యాయస్థానం అనుమతిస్తే మాత్రం ఏడు స్థిరాస్థుల అటాచ్ చేయడానికి సీఐడీ అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్ లక్ష్యంగా ఏపీ సీఐడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story